ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరవడంతో హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణుల ‘జై తెలంగాణ’ నినాదాలు మిన్నంటాయి. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ముఖ్య నేతలు పాల్గొని స్వీట్లు పంచుకున్నారు. చివరికి న్యాయమే గెలిచిందని సంతృప్తిని వ్యక్తం చేశారు. విదేశాల్లోనూ సంబురాలు జరుపుకోవడం విశేషం.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసం వద్ద బాణాసంచా కాల్చి జై తెలంగాణ నినాదాలతో సంబురాలు జరుపుకుంటున్న నేతలు, కార్యకర్తలు. చిత్రంలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మేడే రాజీవ్‌సాగర్, పల్లె రవికుమార్‌గౌడ్, రామచంద్రనాయక్
తెలంగాణ భవన్ వద్ద పటాకులు కాల్చి జై తెలంగాణ నినాదాలు చేస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి మహూద్ అలీ, బీఆర్ఎస్ నేతలు
లండన్‌లో సంబురాలు చేసుకుంటున్న బీఆర్ఎస్ ఎన్నారై యూకే నేతలు నవీన్‌రెడ్డి, అనిల్ కూర్మాచలం, రత్నాకర్ కడుదుల, రవి రేటినేని, సత్య చిలుముల
ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో స్వీట్లు తినిపించుకుంటున్న నాయకులు. చిత్రంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సీనియర్ నేత ఆర్జేసీ కృష్ణ తదితరులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బాణాసంచా కాల్చి, జైతెలంగాణ నినాదాలు చేస్తూ సంబురాలు జరుపుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు. చిత్రంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
బంజారాహిల్స్ కవిత నివాసంలో ఆమె కుమారుడు ఆర్యకు స్వీటు తినిపిస్తున్న మహిళలు
నల్లగొండలోని క్లాక్‌టవర్ సెంటర్లో పటాకులు సంబురాలు చేసుకుంటున్న శ్రేణులు
నిజామాబాద్ నగరంలోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కార్యాలయం ఎదుట భారత జాగృతి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకుంటున్న నాయకులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకుంటున్న నాయకులు