Telangana | ఆ వ్యాఖ్యలను రికార్డుల్లోంచి తొలగించాలి.. మండలి చైర్మన్‌కు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి
గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తంచేశారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రికార్డుల్లోంచి తొలగించాలని శాసనమండలిలో కవిత సవరణను ప్రతిపాదిస్తూ మండలి చైర్మన్‌కు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.
Telangana | హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తంచేశారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రికార్డుల్లోంచి తొలగించాలని శాసనమండలిలో కవిత సవరణను ప్రతిపాదిస్తూ మండలి చైర్మన్‌కు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ‘విముక్తి’, ‘అణచివేత’, ‘నియంతృత్వ పాలన’, ‘వ్యవస్థల విధ్వంసం’, ‘వివక్ష’ వంటి పదాలను తొలగించాలని సవరణను ప్రతిపాదించారు.
శనివారం మండలి మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, ఎమ్మెస్ ప్రభాకర్, తాతా మధు, ఎంసీ కోటిరెడ్డితో కలిసి కవిత మాట్లాడారు. రెండుసార్లు ప్రజలు ఓట్లు వేస్తేనే భారీ మెజారిటీతో గెలిచిన ప్రభుత్వాలమీద విపరీతమైన వ్యాఖ్యలు గవర్నర్ ప్రసంగంలో చేయడం అందరినీ బాధించిందని అన్నారు. మండలిలో బీఆర్ఎస్కే మెజార్టీ ఉన్నప్పటికీ, ప్రభుత్వానికి సహకరించాలని.. తద్వారా ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నర్ ప్రసంగంలో ఉన్న అంశాలకు తాము చేసిన అమెండ్మెంట్ను విత్‌డ్రా చేసుకున్నామని వివరించారు. తెలంగాణ ప్రజలకు నష్టం జరిగే ఎలాంటి నిర్ణయం జరిగినా కచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని కవిత స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

