హైదరాబాద్, నవంబర్ 26 (నమ స్తే తెలంగాణ): పది రోజులకో పసిప్రాణం పోతున్నా సరారు లో చలనం లేదని, ప్ర జాపాలన అంటే ఇదేనా? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర సర్కారును నిలదీశారు. వాంకిడి విద్యార్థిని శైలజ మృతిచెంది 24 గంటలు గడవక ముందే నారాయణపేట జిల్లా మాగనూరు పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇవి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శ నం’ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.