హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికల ముందు ఓ మాట.. గెలిచాక మరో మాట మాట్లాడుతున్న రేవంత్రెడ్డి రెండు నాలల ధోరణి అవలంబిస్తున్నారని ఎక్స్ వేదికగా ఆరోపించారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, దురి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రుణాలు మాఫీ చేసి అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, డబ్బులు కట్టాలని అంకోల్ తండాలో రైతులపై ఒత్తిడి తీసుకురావడం, బలవంతంగా భూముల వేలానికి ప్రయత్నించడం నియంతృత్వ పాలనను తలపిస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో అంకోల్ తండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించి, ఇప్పుడు అప్పు చెల్లించాలని వేధించడం, రైతులకు రేవంత్రెడ్డి సరారు చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శనమని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.