హనుమకొండ, ఆగస్టు 27: అబద్ధాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ మూర్ఖుడని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. శనివారం ఆయన హనుమకొండలో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. హనుమకొండలో నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. బీజేపీకి ప్రజాదరణ లేదని చెప్పారు. పాదయాత్రలో తెలుసుకున్నదేమిటి? సభలో మాట్లాడిందేమిటని ప్రశ్నించారు. బయ్యారం ఉకు ఫ్యాక్టరీ, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీపై మాట్లాడకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకొన్నారని మండిపడ్డారు. ‘కిషన్‌రెడ్డికి, బండి సంజయ్‌కి సవాల్ చేస్తున్నా.. మీరు పాలిస్తున్న రాష్ర్టాలకు వెళ్దాం. ఇకడ అమలవుతున్న సీంలు అకడ ఇస్తే నేను క్షమాపణలు చెప్తా.. లేకుంటే మీరు తప్పయిందని ఒప్పుకొంటారా?’ అని ప్రశ్నించారు. ఎనిమిదేండ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ రూ.3,68,798 కోట్లు చెల్లిస్తే, తెలంగాణకు ఇచ్చింది రూ.2 లక్షల కోట్లేనని వివరించారు. తెలంగాణకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటాను చెల్లించాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు మాట్లాడి విలువ తగ్గించుకోవద్దని కిషన్‌రెడ్డికి హితవు చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై కేసులు పెడుతున్నారని, వాటికి భయపడమని స్పష్టంచేశారు.
ప్రజల మన్ననలేని బీజేపీ: ఎమ్మెల్సీ కడియం
ప్రజల మన్నన, ఆదరణ లేనందునే బీజేపీ సభ ఫ్లాప్ అయిందని కడియం శ్రీహరి అన్నారు. జన సమీకరణ చేయలేక చతికిల పడ్డారని ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి అనేక నిధులు ఇచ్చామని అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీవు తెలంగాణ బిడ్డవైతే.. యూపీలో నేషనల్ హైవేలకు ఎన్ని నిధులిచ్చారు? తెలంగాణకు ఎన్ని ఇచ్చారో లెక చెప్పాలన్నారు. యూపీకి ఇచ్చిన నిధుల్లో కనీసం 25 శాతమైనా తెలంగాణకు ఇచ్చారా? అని ప్రశ్నించారు. బీజేపీ దగుల్బాజీ పార్టీ అని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసే కుట్రలు చేస్తున్నదని విమర్శించారు.
కిషన్‌రెడ్డికి, బండి సంజయ్‌కి సవాల్ చేస్తున్నా.. మీరు పాలిస్తున్న రాష్ర్టాలకు వెళ్దాం. ఇకడ అమలవుతున్న సీంలు అకడ ఇస్తే నేను క్షమాపణలు చెప్తా.. లేకుంటే మీరు తప్పయిందని ఒప్పుకుంటారా?
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు