Kadiyam Srihari | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): 75 ఏండ్ల దేశ చరిత్రలో దళితుల అభ్యున్నతి గురించి సీఎం కేసీఆర్ మాత్ర మే ఆలోచించారని విప్లవాత్మక దళిత బంధు తీసుకొచ్చారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చెప్పారు. ఇది దేశానికే రోల్‌మాడల్‌గా నిలిచిందని తెలిపారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ గొప్ప విజనరీ అని, దేశంలో నెహ్రూ తర్వాత అంతటి గొప్ప స్టేట్స్‌మన్ అని ప్రశంసించారు.
పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రతినిధుల సభలో సచివాలయానికి అంబేద్కర్ పేరు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు, దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. పార్లమెంటుకు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చే స్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టా రు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం దళితజాతికి గర్వకారణమని పేర్కొన్నారు. ఢిల్లీ పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. దేశంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందాలంటే ఢిల్లీలో బీఆర్ఎస్ జెండాను ఎగరేయాల్సిందేనని అన్నారు.