హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై(Congress party) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఎంతో కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేల కోసం పాత వారిని పక్కన పెట్టకండని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తీసుకురావడానికి కష్టపడితే నేడు నోటికాడ పళ్లెం లాక్కున్నట్లు అయింది మా పరిస్థితి అన్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా కూడా.. అవమానాలు ఎదుర్కొంటునే ఉన్నామన్నారు.
పది సంవత్సరాలు సర్వశక్తులు ఒడ్డిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉండాలన్నారు.
కాగా, తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను జీవన్‌రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నప్పటికి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని తప్పుబట్టారు. అంతేకాదు పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఆయన లేఖ రాసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేల కోసం పాత వారిని పక్కన పెట్టకండి.
పదేళ్ల తరువాత అధికారంలోకి తేవడానికి కష్టపడ్డాం.. నోటికాడ పళ్ళెం లాక్కున్నట్లు అయింది మా పరిస్థితి.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి… pic.twitter.com/pHNHMvbmLh
— Telugu Scribe (@TeluguScribe) November 4, 2024