కూల్చకుండా.. మూసీ శుద్ధి చేపట్టాలి
ప్ర భుత్వాలు రూపొందించే బడ్జెట్లో స్వప్రయోజనా ల కోసం కాకుండా ప్రజ ల సమష్టి ప్రయోజనాలను కాపాడేలా కేటాయింపులు ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు.
- బడ్జెట్ రూపకల్పనలో నైతిక ప్రమాణాలు ఉండాలి
- ఎస్సీ డిక్లరేషన్ ఎందుకు అమలుచేయడం లేదు?
- ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ప్ర భుత్వాలు రూపొందించే బడ్జెట్లో స్వప్రయోజనా ల కోసం కాకుండా ప్రజ ల సమష్టి ప్రయోజనాలను కాపాడేలా కేటాయింపులు ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు. బడ్జెట్ అంటే కేవలం అంకెలు, సంఖ్యలు మాత్ర మే కాదు, నైతిక ప్రమాణాలు కూడా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్ యూపీ, మహారాష్ట్ర తర్వాత అతి పెద్ద బడ్జెట్. కానీ, గత రెండేండ్లు కేటాయించిన బడ్జెట్లో ప్రతి ఏటా 60 శాతానికి మించి నిధులు ఖర్చు చేయలేదని చెప్పా రు. ఆరు గ్యారెంటీల అమలుపై బడ్జెట్లో కేటాయింపులు లేవని అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఉద్యోగాల భర్తీ ప్రస్తావన లేదని, గత ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్లు, పరీక్షలకు నియామక పత్రాలు మాత్రమే ఇస్తే ఉద్యోగాల భర్తీ పూర్తయిన ట్టు కాదని పేర్కొన్నారు. చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ను ఎందుకు అమ లు చేయడం లేదని ప్ర శ్నించారు. పాలమూరు, ఉస్మానియా యూనివర్సిటీలో రెండేండ్లుగా మెస్ బిల్లు లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మూసీని శుద్ధి చేయడానికి తాను వ్యతిరేకం కాదని, కేసీఆర్ ఉన్నప్పుడే మురుగునీటి శుద్ధి కేంద్రాలు తెచ్చారని చెప్పారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చవద్దని, ప్రజలను బలవంతంగా ఇండ్లు ఖాళీ చేయించాల్సిన అవసరం లేకుండా మూసీ శుద్ధి చేపట్టాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

