Telanangana | తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర.. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడిందని.. మన భాష, యాసపై జరుగుతున్న దాడిని వ్యతిరేకించాల ని కవి, రచయిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివా స్ పిలుపునిచ్చారు.
- తెలంగాణపై వ్యతిరేకతను చూపేలా రేవంత్ పాలన
- భాష, యాసపై జరుగుతున్న దాడిని వ్యతిరేకించాలి
- ‘ప్రమాదంలో తెలంగాణ’పై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26(నమస్తే తెలంగాణ) : తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడిందని.. మన భాష, యాసపై జరుగుతున్న దాడిని వ్యతిరేకించాల ని కవి, రచయిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివా స్ పిలుపునిచ్చారు. ఉద్యమంపై ఉన్న వ్యతిరేకతను సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలనలో చూపి స్తూ, తెలంగాణ వ్యతిరేకులకు వత్తాసు పలుకుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రమాదంలో తెలంగాణ’ అంశంపై ఇండిపెండెం ట్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో సోమాజిగూ డ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం రౌండ్ టేబుల్ స మావేశం నిర్వహించారు. ఇక్కడ దేశపతి మా ట్లాడుతూ.. జై తెలంగాణ’ అనే మాట అనడానికి కూడా మన ము ఖ్యమంత్రికి నోరు రా వడం లేదని, ఆ నినాదమే రాష్ర్టాన్ని తెచ్చిపెట్టిందని గుర్తుంచుకోవాలన్నారు. రాచరిక పోకడతో పాలిస్తూ మన చారిత్రక చిహ్నాలను రాచరిక చిహ్నా లు అంటున్నారని మండిపడ్డారు. ఉద్యమ ఆ నవాళ్లను చెరిపేసే కుట్రతోనే తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తీసేసి మన సంస్కృతిని అవమానించారని ఆరోపించారు. రోశయ్య, ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్ఠించడం సమైక్యవాదుల ప్రతీకారాత్మక చర్యగా అభివర్ణించారు. సీనియర్ జర్నలిస్టు శివారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రముఖులు శ్రీధర్‌రావు దేశ్ పాండే, దూదిమెట్ల బాలరాజ్, రమణకుమార్, విజయ్‌కుమార్‌రెడ్డి, సరిత, బుచ్చన్న పాల్గొన్నారు.
ఉద్యమకారులంతా ఏకం కావాలి
తెలంగాణ సాధించుకొని ఇన్నేండ్లయినా తర్వాత కూడా మన అస్తిత్వం, హక్కుల గురించి మళ్లీ మాట్లాడుకోవాల్సిన రావడం దురదృష్టకరం. మన సంస్కృతి, అస్తిత్వం, మహనీయుల విగ్రహాలను కూడా కించపరిచేలా కొన్ని యూట్యూబ్ చానెళ్లు, వ్యక్తులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయి. మన అస్తిత్వానికి ముప్పు వాటిల్లినప్పుడు పార్టీలు, సిద్ధాంతాలకతీతంగా కలిసి పోరాడాలి
– మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
మన అనైక్యతే వాళ్ల బలం
ఉద్యమకాలంలో ఉన్న ఐక్యత ప్రస్తుత లేకపోవడం దారుణం. తెలంగాణ స్థానిక పార్టీని పోగొట్టుకొని చాలా తప్పు చేశాం. వాస్తవానికి ఆంధ్రా నాయకులకు బలం లేదు. మన అనైక్యతనే వాళ్ల బలం. తొమ్మిదిన్న రేండ్లలో ఏం జరిగిందో చూశాం. గత ప్రభుత్వానికి ఇంకో అవకాశం ఇచ్చుంటే బాగుండేది. కాంగ్రెస్‌కు స్థానికత లేదు. టీడీపీ ఆంధ్రా పార్టీ. తెలంగాణకు పెద్దఎత్తున అన్యాయం చేసిన పార్టీ.
– దంటు కనకదుర్గ, రచయిత్రి
గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలి
తెలంగాణ అస్తిత్వ స్పృహ, దానిపై పొంచి ఉన్న ముప్పు గురించి జరుగుతున్న చర్యలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా గ్రామీణ స్థాయికి విస్తరించాలి. ఆస్తిత్వ స్పృహ లేని వారిని, సమాచారం లేని వారిని చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా ముందుకుసాగాలి. – సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్
అస్తిత్వానికి ప్రమాదం మొదలైంది
తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చినప్పుడే ఇక్కడ అస్తిత్వం ప్రమాదంలోకి నెట్టబడింది. పార్టీ గుర్తు అభయ హస్తాన్ని పెట్టడం ఇక్కడి సంస్కృతికపై దాడే. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే తెలంగాణ ఎవరూ జాగీర్ అనే చర్చ మొదలైంది.తెలంగాణ వ్యతిరేకులు కొత్త వేషంతో వస్తున్నారు. జాగ్రత్త!
– కవి, రచయిత నందిని సిధారెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

