369 మందిని బలిచ్చిన వ్యక్తి మహనీయుడా?
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం నినదించిన 369 మంది అమాయ క విద్యార్థులు, యువకులను తుపాకీగుళ్లకు బలిచ్చిన కాసు బ్రహ్మానందరెడ్డిని మహనీయుడని కీర్తిస్తూ తెలంగాణ సీఎంవో అధికారికంగా ఆయనకు నివాళులర్పించడాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు.
- కాసు బ్రహ్మానందరెడ్డికి నివాళులర్పించడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమే
- ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఫైర్
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం నినదించిన 369 మంది అమాయ క విద్యార్థులు, యువకులను తుపాకీగుళ్లకు బలిచ్చిన కాసు బ్రహ్మానందరెడ్డిని మహనీయుడని కీర్తిస్తూ తెలంగాణ సీఎంవో అధికారికంగా ఆయనకు నివాళులర్పించడాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. నాటి ఉద్యమ సమయంలో కాల్పుల్లో మరణించిన వారి మృతదేహాలను సైతం కుటుంబాలు, బంధువులకు అప్పగించకుండా, రాత్రికి రాత్రే దహ నం చేయించిన ఘోరం కాసు బ్రహ్మానందరెడ్డిదని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలోనూ తెలంగాణ చరిత్ర, ఇకడి ప్రజల ఆకాంక్షలు, అమరుల త్యాగాలను కాళ్లకింద వేసి తొకుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన వారిని విస్మరించి, నాటి ఉద్యమాన్ని క్రూరంగా అణచివేసిన పాలకులను అధికారికంగా కీర్తించడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు.
రక్తపుటేరులు పారించిన చరిత్ర
1969 ఉద్యమంలో శాంతియుతం గా నిరసన తెలుపుతున్న 369 మంది విద్యార్థులు, యువకులను నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిందని దేశపతి గుర్తుచేశారు. అంతులేని రక్తపాతాన్ని సృష్టించిన వ్యక్తులను మహనీయులుగా అభివర్ణించడం చారిత్రక నేరమని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నది అమరుల త్యాగాల పునాదుల పైనేనని, అలాంటిది నేడు తెలంగాణ అధికారిక పీఠంపై ఉండి అమరుల హంతకులకు నివాళులర్పించడం అమరుల ఆత్మలను క్షోభ పెట్టడమేనని హెచ్చరించారు. ఈ ఘటన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నదని, ప్రభుత్వ వైఖరిని ప్రతిఒకరూ ఖండించాలని దేశపతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

