రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. వాచస్పతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పంచుమర్తి నరేష్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దామోదర ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పరిశోధనాత్మక కథాంశమిదని, ఆద్యంతం సస్పెన్స్‌తో ఆకట్టుకుంటుందని, కథలోని మలుపులు ఉత్కంఠను రేకెత్తిస్తాయని దర్శకుడు వాచస్పతి తెలిపారు.
ఈ సినిమా ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆర్.ఆర్.ధృవన్, నిర్మాణ సంస్థ: ఫస్ట్‌కాపీ మూవీస్, కేడీ అండ్ కో, దర్శకత్వం: వాచస్పతి.