హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అప్పులపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తప్పుడు లెక్కలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ దా సోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. పవిత్రమైన చట్టసభలో కేసీఆర్‌పై పనిగట్టుకొని దు ష్ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డా రు. ‘తమ చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నరు. దానికి మేమేం చేస్తం.. రోగి కో రుకున్నది అదే.. డాక్టర్ ఇచ్చిన మందు అదే అన్నట్టున్నది వ్యవహారం..’ అంటూ ముఖ్యమంత్రి కాకముందే తన నిజ స్వరూపాన్ని బ యట పెట్టుకున్న రేవంత్‌రెడ్డి, అవే అబద్ధాలు, మోసాల పునాదులపై పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఆదివారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నేతలు వాసుదేవరెడ్డి, స్వామి తో కలిసి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర అప్పులపై సీఎం తప్పుడు లెక్కలు చెప్పారనే విషయం సోషియో ఎకనమిక్ సర్వే బట్టబయలు చేసిందని దాసోజ్ శ్రవణ్ పేర్కొన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని, తాము 23 నెలల కాంగ్రెస్ పాలనలో రూ.3.47 లక్షల కోట్ల అప్పులు తెచ్చి, ఇందులో 3.3 లక్షల కోట్లతో అప్పులు చెల్లించామని ముఖ్యమంతి అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ 23 నెలల్లో కట్టిన అప్పు రూ.1.67 లక్షలు మాత్రమేనని చెప్పారు. ‘రాజ్యాంగబద్ధంగా అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి చట్టసభల్లో అబద్ధాలు చెప్పవచ్చా? తప్పుడు ప్రచారం చేయవచ్చా? బడ్జెట్‌ను చీట్ చేసే సీఎం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉంటారా?’ అని విమర్శించారు. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగం అబద్ధమని తాను మాట్లాడితే అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ సభ్యులు సీఎం తప్పుడు లెక్కలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎండగట్టేందుకే ప్రైవేట్ మెంబర్ బిల్లు
కాంగ్రెస్ సర్కార్ డొల్లతనాన్ని, మోసపూరిత హామీలను ఎండగట్టేందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆరు గ్యారెంటీలపై అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నారని శ్రవణ్ పేర్కొన్నారు. ఈ బిల్లుకు అధికారపక్షంతోపాటు ఇతర పార్టీల సభ్యులు కూడా మద్దతివ్వాలని విజ్ఞప్తిచేశారు. విద్యా విధానంపై గొప్పలు చెప్పిన ప్రభుత్వం బడ్జెట్లో 8% నిధులే కేటాయించడం బాధాకరమని పేర్కొన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులివ్వాలని సిఫారసు చేసిన విద్యాక మిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. విద్యాభివృద్ధిపై ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలుపాలని డిమాండ్ చేశారు.
