MLC Dasoju Sravan | అధికారం అండతో భూ దందా..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు ధ్వజం
‘రాజ్యాంగాన్ని రక్షిస్తానని దేవుడి సాక్షి గా ప్రమాణం చేసిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకొని కొడుకు ముసుగులో యథేచ్ఛగా భూ దందాలకు పాల్పడుతున్నడు.
- వట్టినాగులపల్లిలో పొంగులేటి కొడుకు హర్ష జబర్దస్తీ కబ్జాలు
- వివాదం సృష్టించి కోట్ల విలువైన భూమిని కాజేసే పన్నాగం
- సతీశ్ షా కుటుంబానికి బెదిరింపులు
- నంబర్ప్లేట్లులేని బుల్డోజర్లతో గోడ, గోశాల విధ్వంసం
- దోపిడీదారులను వదిలిపెట్టం
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు ధ్వజం
- పొంగులేటి బాధితులతో కలిసి తెలంగాణభవన్‌లో ప్రెస్‌మీట్
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ‘రాజ్యాంగాన్ని రక్షిస్తానని దేవుడి సాక్షి గా ప్రమాణం చేసిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకొని కొడుకు ముసుగులో యథేచ్ఛగా భూ దందాలకు పాల్పడుతున్నడు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రియల్ ఎస్టేట్ మాఫియాను న డుపుతూ విలువైన భూములను గద్దల్లా తన్నుకుపోతున్నడు. భూములను రక్షించాల్సిన ఆ యన భక్షకుడిగా మారి రాక్షసుడిలా వ్యవహరిస్తున్నడు.. కోర్టు తీర్పులను ధిక్కరిస్తూ, రా జ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నడు..’ అంటూ ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. పొంగులేటి భూ దాహానికి సతీశ్ షా, పల్లవీషా కుటుంబం విలవిల్లాడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. వారి కుటుంబాల మధ్య లేని వివాదాన్ని సృష్టించి, డెవలప్మెం ట్ పేరిట కోట్ల విలువైన భూమిని చెరబట్టేందు కు యత్నిస్తున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో గురువారం పొంగులేటి బాధితులు సతీశ్‌షా, పల్లవీషాతో కలిసి శ్రవణ్ విలేకరులతో మాట్లాడారు. వట్టినాగులపల్లి భూ ముల వ్యవహారం షా కుటుంబం సొంతానిది కాదని, ప్రజలందరిదని వ్యాఖ్యానించారు.
హర్షా.. అభినవ్ షా ఒప్పందంతోనే వివాదం
మంత్రి పొంగులేటి కొడుకుకు చెందిన న్యూజెన్ బిల్డర్స్ కంపెనీ 258 సర్వేనంబర్‌లోని అభినవ్షా భూమిని డెవలప్ చేస్తానని ఒప్పందం చేసుకున్నప్పుడే వివాదం మొదలైందని శ్రవణ్ తెలిపారు. ఈ ఒప్పందాన్ని అడ్డుపెట్టుకొని మొదట రోడ్డు, ఆ తర్వాత అప్రోచ్ రోడ్డు కోసం సర్వే నంబర్ 169లో రెండెకరాల భూమి కావాలని పొంగులేటి హర్ష సతీశ్‌షా ఇంటికి వచ్చారని చెప్పారు. వారు తిరస్కరించడంతో స్వయంగా మంత్రి పొంగులేటి రంగప్రవేశంచేసి అర్ధరాత్రి వారి ఇంటికివెళ్లారని ఆరోపించారు. సతీశ్‌షా తిరస్కరించడంతో తిరి గి సర్వే డ్రామాలు మొదలు పెట్టారని మండిపడ్డారు. ఏసీబీకి రూ.100 కోట్లతో పట్టుబడ్డ సర్వే ఏడీఈ శ్రీనివాసులుతో సర్వే నాటకం మొదలు పెట్టారని దుయ్యబట్టారు. సదరు భూమి 111 జీవో పరిధిలోకి వస్తుందని బెదిరింపులకు దిగారని ధ్వజమెత్తారు. ఏడీఈ సర్వే కు ఒప్పుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించి 2025 అక్టోబర్ 7న పల్లవీషాతో బలవంతంగా సంతకాలు తీసుకున్నారని చెప్పారు. భయపడ్డ పల్లవీషా సర్వే నుంచి వైదొలుగుతున్నట్టు చెప్పడంతో పాటు హైకోర్టుకు వెళ్లారని, ధర్మాసనం సైతం ఆమె వాదనతో ఏకీభవిస్తూ సర్వే రిపోర్టు చెల్లదని తీర్పు నిచ్చిందని గుర్తుచేశారు.
బౌన్సర్లతో దాడులు..
హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అక్టోబర్ 25న 70 మంది మాస్కులు ధరించిన బౌన్స ర్లు, గుండాలు, నంబర్ ప్లేట్లులేని బుల్డోజర్లతో వచ్చి 2021లో పల్లవీషా కట్టుకున్న గోడను దుర్మార్గంగా ధ్వంసంచేశారని శ్రవణ్ వెల్లడించారు. అక్టోబర్ 27న మరోసారి బౌన్సర్లు, కిరాయి గూండాలు వచ్చి గోశాలను కూల్చివేశారని తెలిపారు. అడ్డుకోబోయిన పల్లవీ, సతీశ్షాను అరెస్ట్ చేశారని చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు తిరిగి కట్టుకున్న గోడను మరోసారి కూల్చివేశారని మండిపడ్డారు. జీవో 111 పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పోలీసులు ఫత్వా జారీచేశారని శ్రవణ్ ఆరోపించారు. మరి పొంగులేటి హర్ష మాత్రం పెద్దపెద్ద బిల్డింగ్లు ఎలా కడుతారని ప్రశ్నించారు. సామాన్యులకు ఓ న్యాయం.. పొంగులేటి కుటుంబానికి మరోన్యాయమా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? అని నిలదీశారు.
హెచ్ఎండీఏ, ఏడీజీ సర్వేలో తేడాలు
ఓఆర్ఆర్ కోసం హెచ్ఎండీఏ చేసిన సర్వే కు, ఏడీజీ చెప్పిన వివరాలకు తేడాలున్నాయ ని శ్రవణ్ చెప్పారు. పల్లవి, సతీశ్‌షా భూములను గుంజుకొనేందుకు ఏడీజీ వారి పక్కను న్న సర్వేనంబర్లలో ఎక్కువ భూమి చూపారని అనుమానం వ్యక్తంచేశారు. స్థానిక పోలీసు అధికారి బాలరాజ్ పొంగులేటి ఒత్తిడికి తలొగ్గి సతీశ్షాను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వాళ్లు కోర్టులు చెప్పినట్టు వినలా? లేక పొంగులేటి గూండాలు చెప్పినట్టు నడుచుకోవాలా? అని ప్రశ్నించారు. దమ్ముంటే మంత్రి పొంగులేటి అమరవీరుల స్తూపం వద్ద సతీశ్‌షా కుటుంబంతో చర్చకు సిద్ధంకావాలని సవాల్ విసిరారు. లేదంటే వారి భూములను వదిలేయాలని డిమాండ్ చేశారు.
వివాదం సృష్టించి కబ్జాకు యత్నం..
వట్టినాగులపల్లిలోని 169, 244, 245 సర్వేనంబర్లలో సతీశ్‌షా కుటుంబానికి వారసత్వంగా వచ్చిన 27.10 ఎకరాల భూమి ఉన్నదని శ్రవణ్ తెలిపారు. ‘2017లో సతీశ్‌షా తల్లి ప్రమీలాదేవి మరణానంతరం వీరి కుమార్తెలు రాధికాషాకు 8.27 ఎకరాలు, ప్రియాంక షాకు 8.27 ఎకరాలు, సతీశ్‌షా సతీమణి పల్లవీషా 10 ఎకరాలు పంచుకున్నరు. 9.5 గుంటల భూమి ప్రభుత్వం తీసుకున్నది. మండల్ సర్వే చేయించి వారి బంధువు అభినవ్ షాతో హద్దులు నిర్ణయించుకున్నరు. 2019లో కుమార్తెలకు ఇచ్చిన భూమిని విక్రయించేందుకు రెండోసారి సర్వేచేయించారు. ఆ తర్వాత అభినవ్ షా తనకు చెందిన 168 సర్వే నంబర్లోని భూమిని సర్వేచేయాలని కోర్టుకు వెళ్లగా మరోసారి సర్వే చేయించారు. హెచ్ఎండీఏ 169 నంబర్లోని పల్లవీషాకు చెందిన తొమ్మిదిగుంటలు, 158లోని అరగుంట తీసుకొని 1.90 కోట్ల పరిహారం చెల్లించింది..’ అని తెలిపారు. ఈ మూడుసార్లు సర్వే చేసిన సందర్భాల్లో ఎలాంటి వివాదం తలెత్తలేదని, హద్దులు నిర్ణయించుకున్నారని గుర్తుచేశారు.
మంత్రి మనుషులు 7 ఎకరాలు కబ్జాకు యత్నిస్తున్నరు..
రేవంత్ ప్రభుత్వం రెవెన్యూ మ్యాప్‌లు మార్చి సామాన్యుల భూములు కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నది. మాకు చెందిన ఏడెకరాలను పొంగులేటి మనుషులు కబ్జా చేసేందుకు కుట్రలు చేస్తున్నరు. గోడను కూల్చి, గోశాలను ధ్వంసం చేశారు. మంత్రి పొంగులేటి స్వయంగా మా భూముల దగ్గరకు వచ్చి న్యాయం చేయాలి. మాకు న్యాయస్థానాలను ఆశ్రయించడం తప్ప గత్యంతరం లేదు. ప్రాణాలు పోయినా పోరాటం ఆపబోం.
– సతీశ్‌షా (పొంగులేటి భూ బాధితుడు)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

