హైదరాబాద్, నవంబర్ 25(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డికి ఎన్నికల సంఘం జేబు సంస్థలా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. ఆగమేఘాల మీద ప్రెస్‌మీట్ పెట్టి షెడ్యూల విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత ఎన్నికల సంఘంతో పా టు ఆ కుర్చీలో కూర్చున్న వారిపైనా ఉంటుందని గుర్తుచేశారు.
కోట్లు ఖర్చు పెట్టి, కులగణన చేసి, తీరా.. 42శాతం రిజర్వేషన్లు లేకుండానే షెడ్యూల్ ఇవ్వడంపై ఆలోచించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రభుత్వం చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించకుం డా, బీసీలను మోసం చేసిందని విమర్శించారు. కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నదని పేర్కొన్నారు. వచ్చే నెల 12న హైకోర్టు తీర్పు బీసీలకు అనుకూలంగా రావచ్చని, ఎందు కింత తొందరపడుతున్నారని ప్రశ్నించారు. 42 శాతం సాధ్యమేనని ప్ర భుత్వ తరఫు న్యా యవాది సింఘ్వీ చెప్పాడని గుర్తుచేశారు. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్, తుంగ బాలు, వాసుదేవరెడ్డి, యశ్వంత్గుప్తా పాల్గొన్నారు.