హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులు వాస్తవాలు తెలుసుకోవాలని, తాము బాధ్యతతో ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు.
మంగళవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగుల సమస్యలకు తమ ప్రభుత్వం విడుదల చేసే జాబ్ క్యాలెండర్ పరిష్కారం చూపుతుందని తెలిపారు.