హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి తో రాష్ట్రంలోని విద్యారంగం సంక్షోభంలోకి కూరుకుపోయిందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో ప్రవేశంతో మొదలు సీటు, ఫీజులు, డొ నేషన్లు, పాఠ్య పుస్తకాలు, హాస్టల్ వసతులు, అధ్యాపకుల కొరతతో విద్యారంగంలో సంక్షో భం నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 8 నెలల కాలంలో విద్యారంగంలో నెలకొ న్న ఏఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచలేదని విమర్శించారు. విద్యారంగ సమస్యల పరిషారం కోసం హైదరాబాద్ ఇందిరాపా ర్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ఎస్ఎఫ్ఐ విద్యా ర్థి మహాగర్జన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 1,864 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మ హాగర్జన తరలివచ్చిన విద్యార్థులను పోలీసు లు ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు టీ నాగరాజు, కార్యదర్శి ఆర్ఎల్ మూర్తి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిస్తున్నట్టు ప్రకటించారు.