వరంగల్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ కాంగ్రెస్‌లో ‘గ్రూప్’ వార్ పతాకస్థాయికి చేరింది. మొదటి నుంచి ఎడమొహం, పెడమొహంగా ఉన్న నేతలు బుధవారం ప్రజాపాలన పేరిట నిర్వహించిన అధికారిక కార్యక్రమంలోనూ ‘తూర్పు పడమర’లుగా విడిపోయారు. పార్టీ పరంగానే కాకుండా అధికారిక కార్యక్రమాలకు మంత్రి కొండా సురేఖ హాజరైతే తాము ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేదిలేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు ఇటు పార్టీ హైకమాండ్‌కు, అటు సీఎంవోకు తెగేసి చెప్పినట్టు సమాచారం. అందువల్లే సెప్టెంబర్ 17న జెండావిష్కరణ అతిథులు మారారని కాంగ్రెస్‌లో జోరుగా చర్చసాగుతున్నది.