హైదరాబాద్, డిసెంబర్19 (నమస్తే తెలంగాణ) : అటవీశాఖ అధికారులు ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారని, పట్టాలున్నా గిరిజన రైతులను, పోడు రైతులను ఇబ్బందులకు గు రిచేస్తున్నారని అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యే లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు మదన్మోహన్, మురళీనాయక్, బాలునాయక్, పాల్వాయి హరీశ్, అనిరుధ్రెడ్డితోపాటు పలువురు స భ్యులు అటవీశాఖ అధికారులు, గిరిజన రైతు ల మధ్య భూవివాదాల సమస్యలపై ప్రస్తావించారు. గిరిజన రైతులకు అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారని, అభివృద్ధి పనులకు సైతం అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యేలు తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బదులిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35 నియోజకవర్గాల్లో అటవీశాఖ అధికారు లు, గిరిజన రైతుల మధ్య వివాదాలు, రెవె న్యూ హద్దులపై సమస్యలు నెలకొని ఉన్నాయని, వాటి పరిష్కరానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్19 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డుల ను అందజేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రేషన్ డీలర్ల సమస్యలు, కొత్త కార్డులపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితర సభ్యులు అసెంబ్లీలో ప్రస్తావించారు. కొ త్త కార్డులు అర్హులందరికీ ఇస్తారా? సన్నబి య్యం ఎప్పటి నుంచి ఇస్తారు? డీలర్ల కమీషన్ పెంపు అంశాలను లేవనెత్తారు.