లింగంపేట(తాడ్వాయి)/షాద్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చాయి. తొలి విడత ఎన్నికలు జరిగిన పలు గ్రామాల్లో కీలక నేతలకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఉహించని స్థాయిలో గెలుపొంది అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వగ్రామం నందిగామ మండలం వీర్లపల్లిలో బీఆర్ఎస్ మద్దతుదారు చిందం పాండు సర్పంచ్‌గా గెలుపొందారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో 153 సర్పంచ్‌లకు 65 మంది బీఆర్ఎస్ సర్పంచ్‌లు విజయం సాధించారు.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో కాంగ్రెస్, బీజేపీలకు ఊహించని రీతిలో పరాభవం ఎ దురైంది. మండలంలోని 18 గ్రామా ల్లో ఎన్నికలు నిర్వహించగా, 10 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు ఘన విజ యం సాధించారు. మరోవైపు, కామారెడ్డి ఎమ్మె ల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి స్వగ్రామాల్లో ప్రతికూల ఫలితాలు రావ డం చర్చనీయాంశమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్, కరకగూ డెం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో మొదటి విడుత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటి ఎమ్మెల్యే తెల్లం వెం కట్రావ్కు భారీ సవాల్ విసిరింది. మొద టి విడుత పంచాయతీ ఫలితాల్లో గులాబీ పార్టీ మద్దతుదారులకు అండగా నిలిచి ఓటర్లు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను ఎండగట్టారు. బూర్గంపహాడ్‌లోని ఐదు పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులకు విజయం కట్టబెట్టారు.