మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 12:09:50

దండారి సంబురాల్లో ఆడిపాడిన ఎమ్మెల్యే

దండారి సంబురాల్లో ఆడిపాడిన ఎమ్మెల్యే

ఆదిలాబాద్ : జిల్లాలో దండారి సంబురాలతో ఆదివాసీ గూడాలు సందడిగా మారాయి. దీపావళి  సందర్భంగా ఆదివాసీ గిరిజనులు దండారి  పండుగను జరుపుకుంటారు. ఓ గ్రామానికి సంబంధించిన గిరిజనులు దండారి వేషధారణలతో ఇతర గ్రామాలకు అతిథులుగా వెళ్తారు. తమ గ్రామానికి వచ్చిన గుస్సాడీలకు గ్రామానికి చెందిన ఆదివాసులు అతిథి మర్యాదలు చేస్తారు. గూడెంలో  దండారి పూజలు నిర్వహించి ఆడిపాడుతారు.

గుస్సాడీ నృత్యాలు మహిళల రేలా రేలా పాటలు, యువకుల కోలాటాలతో ఆదివాసి గూడాలు పండగ ప్రత్యేకతను చాటుతున్నాయి. దీపావళి రోజు దండారి పండుగలు ముగిస్తారు. కాగా, శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. ఆదివాసీలతో కలిసి నృత్యం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.