MLA Vivekanand Goud | కంటోన్మెంట్లో మంచి పేరు సంపాదించాలనే తాపత్రయం లాస్య నందితలో ఉండేది : ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్
MLA Vivekanand Goud | కంటోన్మెంట్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత.. తన నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించాలనే తాపత్రయం, తపన ఆమెలో ఉండేదని ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గుర్తు చేశారు. లాస్య నందిత మృతిపట్ల శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ మాట్లాడారు.
MLA Vivekanand Goud | హైదరాబాద్ : కంటోన్మెంట్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత.. తన నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించాలనే తాపత్రయం, తపన ఆమెలో ఉండేదని ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గుర్తు చేశారు. లాస్య నందిత మృతిపట్ల శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ మాట్లాడారు.
లాస్య నందిత మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. సాయన్న తన నియోజకవర్గం పేరుతోనే పిలవబడేవారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆయన సుపరిచితుడు. అందరితో మంచి సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి. ఆయన బిడ్డలు కూడా ఎంతో చురుకుగా ప్రజాక్షేత్రంలో ఉండేవారు. ప్రజల మన్ననలు పొందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అందరిని ప్రత్యక్షంగా కలిసి, మీ అందరి సహకారం, సూచనలు, సలహాలు కావాలని అడిగేది. నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించాలని తపనతో ఉండేది ఆమె అని వివేకానంద్ గౌడ్ పేర్కొన్నారు.
నేను కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు సాయన్న సీనియర్ ఎమ్మెల్యే. హైదరాబాద్ పరిధిలోని మా 15 మంది ఎమ్మెల్యేల్లో వారు సీనియర్. ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రశ్నలు అడగాలి. ప్రజా సమస్యలు ఇలా లేవనెత్తాలని చెప్పి ప్రోత్సహించారు సాయన్న. సాయన్న ఎంతో అండగా ఉండేవారు. తనకు సాయన్న సహకారం అందించినట్లే నందితకు కూడా సహకారం అందించాలని అనుకున్నాం. కానీ ఆమె మరణించడం బాధాకరం. కవాడిగూడ కార్పొరేటర్గా గెలిచినప్పుడు కూడా ఆమె 150 మంది కార్పొరేటర్లతో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. జీహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్లో కూడా లాస్య నందిత సేవలను గుర్తు చేసుకున్నారు. ఆమె ఎంతో అంకితభావంతో పని చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ తరపున ఆమె కుటుంబానికి అండగా ఉంటాం అని ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | లాస్య నందిత భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఆశించాం.. భావోద్వేగానికి లోనైన కేటీఆర్
Union Budget | 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాలు : నిర్మలా సీతారామన్
Mudra loans: ముద్రా రుణాల పరిమితి 20 లక్షలకు పెంపు
Union Budget | కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు.. అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల సాయం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

