Union Budget | 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాలు : నిర్మలా సీతారామన్
Union Budget | కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Niramala Sitaraman) ఇవాళ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఆమె.. వివిధ రంగాలకు ప్రభుత్వం చేసిన కేటాయింపుల వివరాలను వెల్లడించారు.
Union Budget : కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Niramala Sitaraman) ఇవాళ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఆమె.. వివిధ రంగాలకు ప్రభుత్వం చేసిన కేటాయింపుల వివరాలను వెల్లడించారు. భవిష్యత్తులో ప్రజా సంక్షేమం కోసం సర్కారు తీసుకోబోతున్న చర్యల గురించి వివరించారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, పరిశ్రమల అభివృద్ధి ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు.
చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి తాము ఆర్థిక సాయం చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎంఎస్ఎంఈ (MSME) క్లస్టర్లు, నూతన సిడ్బీ బ్యాంకు బ్రాంచ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎగుమతులు, ఎగుమతుల సేవల కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాలను కల్పిస్తామని ప్రకటించారు.
అంతేగాక దేశంలోని వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 12 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
మినరల్ మిషన్ ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగా కీలక ఖనిజాల గుర్తింపు, ఎగుమతులకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. ఆఫ్షోర్ మైనింగ్కు నూతన విధానాన్ని అవలంభించనున్నట్లు తెలిపారు. సాగర గర్భంలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ, తవ్వకాల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

