హైదరాబాద్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): లగచర్ల ఘటనలో కేటీఆర్ పాత్రపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, ఆయన పాత్ర ఉంటే వెంటనే అరెస్టు చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం డిమాండ్ చేశారు. కేటీఆర్ కుట్రలో భాగంగానే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఈ దాడికి ప్లాన్ చేశారని ఆరోపించారు.
కొడంగల్లో దళిత, గిరిజన, బీసీ బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ జరుపుతుండగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అకసుతో కేటీఆర్ ఇలా వ్యవహరించారని పేర్కొన్నారు.