దేశానికి అధికంగా పన్నులు చెల్లిస్తున్న తెలంగాణను కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిర్ల క్ష్యం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. విభజన చట్టంలో ఉన్న హామీలను ఈ బడ్జెట్లోనూ పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. సాగునీటి, మౌలి క సదుపాయాల కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఒక రూపాయి కూడా కేటాయించలేదని, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదా ఈ బడ్జెట్లో కుడా ఇవ్వలేద ని మండిపడ్డారు.
మెట్రో విస్తరణ, రైల్వే జోన్లు, జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. రైతులకు ఉపయుక్తమైన పథకాలకు కేంద్ర మద్దతు లేకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శ నం అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కు 16 ఎంపీలు కట్టబెట్టి ఉంటే.. ఆంధ్రప్రదేశ్, బీహార్‌కు వేలకోట్ల నిధుల వరద ఎట్లా పారుతున్నాయో.. తెలంగాణకు కూడా అలాగే నిధులు తెచ్చేవారమని చెప్పారు.