నర్సాపూర్, ఫిబ్రవరి 17 : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ఏర్పాటు చేస్తున్న జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డును ఐక్యంగా అడ్డుకుందామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ప్యారానగర్లో డంపింగ్‌యార్డు ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం నర్సాపూర్‌లో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అఖిలపక్ష సంఘీభావం తెలుపుతూ మాట్లాడారు. డంపింగ్‌యార్డు కోసం కేటాయించిన భూమి ప్రభుత్వ భూమి కాదని సర్వేలో తేలిందన్నారు. డంపింగ్‌యార్డును రద్దు చేసే వరకు పోరాడుదామని పిలుపునిచ్చారు. డంపింగ్‌యార్డు ఏర్పాటుతో వాయు, జల కాలుష్యంతో పర్యావరణం దెబ్బతింటుందని, పర్యాటకాభివృద్ధికి విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాం.