జగిత్యాల : సీఎం కేసీఆర్ జగిత్యాల(Jagithyla) జిల్లాను ఏర్పాటు చేసి నాలుగువేల కోట్ల రూపాయలతో అబివృద్ధి చేశారని జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ (MLA Sanjay) అన్నారు. ఆదివారం జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనేది సీఎం కేసీఆర్ విధానం అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లలా భావించి ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇచ్చాం.
రోడ్లు, దవాఖానలు ఇలా అనేక అభివృద్ధి పనులు చేశాం. బీడీ కార్మికులకు పెన్షన్ కేసీఆరే ఇచ్చారని, రాని వారికి కూడా ఇవ్వాలన్నారు. రాయికల్ మండలంలోని అల్లీపూర్ను మండల కేంద్రం చేయాలని కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం నిత్యావసర ధరలు పెంచింది. ఎరువుల ధరలు, మోటర్లకు మీటర్లు పెట్టి మోసం చేస్తున్న బీజేపీకి ఓటు వేయొద్దన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కష్టాలు తప్పవన్నారు.