జగిత్యాల : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్నో రకాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. అన్ని మతాలతో పాటు అన్ని కులాలకు సమూచిత గౌరవం కల్పించింది. కుల సంఘాల కోసం నిర్మించిన భవనాలు సబ్బండ వర్గాలకు ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలుస్తున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు.
జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్(Narsingapur) గ్రామంలో ఎస్డీఎఫ్ నిదులు రూ. 2.50 లక్షలతో విశ్వబ్రాహ్మణ సంఘం, ఎల్లమ్మ ఆలయం వద్ద సీడీపీ నిధులు రూ.6.50 లక్షలతో నిర్మించిన గౌడ సంఘం(Gouda Sangam building) నూతన భవనాలను డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దావా వసంత, ఎమ్మెల్సీజీవన్ రెడ్డి, ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, సర్పంచ్ సరోజన, ఎంపీటీసీ మహేష్, ఉప సర్పంచ్ చంద్రయ్య, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగారెడ్డి, నాయకులు తిరుపతి గౌడ్, మల్లేశం గౌడ్, రాజి రెడ్డి, గంగారాం, హరీశ్, మాజీ ఎంపీటీసలు కుడుకల లక్ష్మణ్, రాజ నర్సయ్య, ఏఈ రాజ మల్లయ్య, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.