జగిత్యాల : అంబేద్కర్ అభయ హస్తం హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు. మంగళవారం సారంగాపూర్ మండల లక్ష్మీదేవిపల్లి గ్రామంలో నల్ల పోచమ్మ దేవి ఆలయం వద్ద లక్షా 50 వేల నిధులతో బోర్ మోటర్ మంజూరు చేసిన సందర్భంగా ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎమ్మెల్యేను లక్ష్మీదేవిపల్లి గ్రామ అంబేద్కర్ సంఘం సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వంద రోజులు పూర్తయ్యాక ఇచ్చిన హామీలు అమలు పరచకుంటే ప్రజల తరఫున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సురేందర్, నాయకులు చిట్ల రమణ, మ్యాకల శేఖర్, మైలారపు రాజం, మ్యాకల గంగాలచ్చం, మైదారపు రాజయ్య, కుంటాల చిన్నరాజం, కుంటాల శేఖర్, మ్యాకల వెంకటరాజం, పసుల రాజు, గంగాధర్, రిషేందర్, తదితరులు పాల్గొన్నారు