హైదరాబాద్ : రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)ను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్(MLA Sanjay Kumar) ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా పొన్నంతో మా కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో నాడు పొన్నం ప్రభాకర్ ఎంతో చురగ్గా పని పాల్గొన్నారని తెలిపారు. అలాగే జగిత్యాల(Jagithyala) నియోజకవర్గ అభివృద్ధిలో వారి సహకారం ఉండాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. అందుకు మంత్రి పొన్నం సానుకూలంగా స్పందించారని సంజయ్ కుమార్ తెలిపారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.