హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : భారత విద్యావిధానాన్ని పరిశీలించేందుకుగాను టరీ ప్రతినిధులు మసూద్ ఓనర్, నూరుల్లా గురువారం హైదరాబాద్‌లో పర్యటించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఏఎస్పీడీ శ్రీహరితో సమావేశమై రాష్ట్రంలోని అల్పాహార, మధ్యాహ్న భోజనం, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
తమ దేశ పరిస్థితులకు అనుగుణంగా బోధనాంశాలను పరిశీలిస్తామని పేరొన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి అధ్యక్షతన విద్యా వ్యవస్థలపై సింపోజియం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ సూల్ను సందర్శించారు.