సత్తుపల్లి రూరల్, సెప్టెంబర్ 16: సీతారామ ప్రాజెక్టుపై పూర్తి హక్కులు సీఎం కేసీఆర్‌కే ఉ న్నాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన ఒక్క కేసీఆర్‌కే రావడం గొప్ప విషయమని కొనియాడారు. సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసితులకు పరిహారం అందించినందుకు శనివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండ లం బుగ్గపాడులో అభినందన సభ ఏర్పాటు చేశారు.
గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే సండ్ర కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. భారీ ర్యాలీ తీసి, సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. భూములు కోల్పోయిన నిర్వాసితులకు సుమారు రూ.15.50 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేయడం జరిగిందని తెలిపారు.