కాంగ్రెస్ను నమ్మితే కష్టాలు తప్పవు
కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మితే మోసపోక తప్పదని మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
- సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యం
- బీఆర్ఎస్ మానకొండూర్ అభ్యర్థి రసమయి
తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 15 : కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మితే మోసపోక తప్పదని మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. బుధవారం తిమ్మాపూర్ మండలం పోలంపల్లి, మల్లాపూర్, నర్సింగాపూర్ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మితే గోస పడతామని హెచ్చరించారు. వెలుగులు నింపే బీఆర్ఎస్ కావాలా? చీకట్లు తెచ్చే కాంగ్రెస్ కావాలా? ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. 60 యేండ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడె ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి గ్రామాల్లోకి వస్తున్నాడని, కరోనా సమయంలో ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తాను అభివృద్ధి చేశానని, మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

