హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బాధ్యతలు స్వీకరించారు. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్, వినోద్, గోరటి వెంకన్న శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ కావూరి హిల్స్ లోని తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయంలో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రసమయి బాలకిషన్ గారికి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. pic.twitter.com/RT4jggJfLI
— V Srinivas Goud (@VSrinivasGoud) July 19, 2021