MLA Rammohan Reddy | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి ఇంటికి 200 యూనిట్ల దాకా ఉచిత కరెంటు ఇస్తున్నారని, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారని, ఆరు గ్యారెంటీలను అద్భుతంగా అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో అభివృద్ధిని చూసే కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.
శనివారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ సరార్ పాలన చూసే ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు స్పీకర్‌కు వినతి పత్రాలు ఇచ్చి రాజకీయం చేస్తున్నారని, కాంగ్రెస్‌లోకి వచ్చే బీఆర్ఎస్ నాయకులంతా స్వచ్ఛందంగానే వస్తున్నారని తెలిపారు. వారి నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకునేందుకు పార్టీ మారుతున్నారని చెప్పారు.