తిమ్మాజిపేట, డిసెంబర్ 7 : ‘ప్రభుత్వం రూ.2 లక్షలలోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. ఆ విషయం ఎవరూ చెప్పరు.. 2 లక్షలకుపైగా ఉన్న రుణమాఫీ గురించి మాత్రం అడుగుతరు’ అంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అసహనం వ్యక్తంచేశారు.శనివారం నాగర్‌కర్నూ ల్ జిల్లా తిమ్మాజిపేటలో రైతులకు సబ్సిడీపై స్ప్రింక్లర్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు రుణమాఫీపై అసంతృప్తి వ్యక్తం చేయ డంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.