బాన్సువాడ రూరల్, అక్టోబర్ 31: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ తగిలింది. శుక్రవారం కామారెడ్డి జిల్లా బోర్లంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పోచారం రాగా, బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఆందోళన చేసిన బీఆర్ఎస్ నేతలు లక్ష్మణ్, అనిల్, సాయిలు, గంగారాం తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.