కోటగిరి/సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 20: డబుల్ బెడ్రూం ఇండ్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయకపోతే ప్రాణత్యాగం చేస్తానని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ ప్రభుత్వం ఉండగా బాన్సువాడ నియోజకవర్గానికి 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయించిన. లబ్ధిదారులకు రూ.400 కోట్ల బిల్లులు ఇప్పించిన. మరో రూ.26.50 కోట్లు పెండింగ్‌లో ఉన్నా యి. అవి మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేస్తే సరే అన్నారు.
కానీ.. ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రె స్ నాయకులు ఆ మంత్రి దగ్గరికి వెళ్లి బిల్లులు ఇవ్వొద్దని చెప్పిండ్రు. నన్ను నమ్ముకుని పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారు. ఎన్నికల్లో పు బిల్లులు రాకపోతే మే 13 తర్వాత లబ్ధిదారులతో కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తా. అప్పటికీ స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా.. ప్రాణత్యాగం చేస్తా’ అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌తో కలిసి నిజామాబాద్ జిల్లా పొతంగల్, కోటగిరి, రుద్రూర్ మండలాల్లో శనివారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో పోచారం మాట్లాడారు.
హామీల పేరిట వంచించారు..
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వంచించిందని, వచ్చే ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని పోచారం పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయానికి కరెంట్, సాగునీరు, పంట పెట్టుబడి, ధాన్యం కొనుగోలు సమస్యలు లేవని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు పోచా రం సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముం దు పోచారం శ్రీనివాసరెడ్డి జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలను అందజేశారు. సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, దఫేదార్ రాజు పాల్గొన్నారు.