హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఒకే నేరానికి సంబంధించి పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టులో గురువారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నరేందర్‌రెడ్డి తరఫున ఆయన భార్య అఫిడవిట్ దాఖలు చేశారు. బొమ్రాస్పేట పోలీసుస్టేషన్లో ఒకే ఘటనపై మూడు కేసులు నమోదు చేశారని తెలిపారు. రాజకీయ కక్షలతోనే ఈ కేసులు నమోదు చేశారని, ఒకదాని తర్వాత మరొకటిగా కేసులు పెట్టి పిటిషనర్‌ను జైలు నుంచి రాకుండా చేయాలన్న కుట్ర జరుగుతున్నదన్నారు. ఒకే నేరానికి సంబంధించి పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయరాదంటూ కోర్టులు తీర్పులు వెలువరించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేయనుంది.