హై కోర్టు తీర్పుతో ధర్మం గెలిచింది
జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టుఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ తీర్పుతో కాంగ్రెస్ కుట్రలు బట్టబయలయ్యాయి. చివరకు ధర్మమే గెలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కోణంలో కమిషన్ ఏర్పాటు చేసి వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేసింది.
జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టుఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ తీర్పుతో కాంగ్రెస్ కుట్రలు బట్టబయలయ్యాయి. చివరకు ధర్మమే గెలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కోణంలో కమిషన్ ఏర్పాటు చేసి వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేసింది. కాళేశ్వరం నిర్మాణానికి కేంద్ర జలవనరుల సంఘం సహా దాదాపు 16 సంస్థలు అనుమతులు ఇచ్చాయి. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఇది ప్రభుత్వ సమష్టి నిర్ణయంగా అమలైంది.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే, జనగామ
కేసీఆర్‌ను ఇబ్బందులు పెట్టాలనే..
న్యాయస్థానంలో అంతిమంగా సత్యం, ధర్మం గెలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రైతాంగానికి దక్కిన నైతిక విజయం. రెండున్నరేండ్లుగా రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు, రాజకీయ డ్రామాలన్నీ హైకోర్టు తీర్పుతో బట్టబయలయ్యాయి. కేసీఆర్, హరీశ్‌రావు ప్రతిష్టను మసకబార్చాలని రేవంత్‌రెడ్డి చేసిన కుట్రలు బెడిసికొట్టాయి.

– చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే, సంగారెడ్డి
కమిషన్ చట్టాన్ని ఉల్లంఘించింది
పీసీ ఘోష్ కమిషన్‌పై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. విచారణ కమిషన్ చట్టాన్ని ఉల్లంఘించింది. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్ విషయాలపై నిష్పక్షపాతంగా విచారణ చేయలేదు. కేవలం ప్రాజెక్టు వ్యతిరేకులు చెప్పిన విషయాలను మాత్రమే నమ్మి నివేదిక తయారు చేసింది. ప్రాజెక్టుకు అనుకూలంగా ఇచ్చిన అఫిడవిట్లు అసలే పట్టించుకోలేదు. హైకోర్టు తీర్పుతో ఇప్పుడు నిజం బయటకు వచ్చింది.

– శ్రీధర్‌రావు దేశ్‌పాండే, నీటి రంగ నిపుణుడు
ప్రభుత్వ కుట్ర బహిర్గతం
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పూర్తికాకముందే అసెంబ్లీలో చర్చించడం, మీడియాకు లీకులు ఇవ్వడం వెనుక ముమ్మాటికీ ప్రభుత్వ రాజకీయ కుట్ర దాగి ఉన్నది. విచారణ ప్రక్రియ అంతా లోపభూయిష్టంగా సాగింది. సహజ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి ఏకపక్షంగా ఒక పార్టీకి అనుకూలంగా ఈ నివేదిక తయారు చేశారు.

తెలంగాణ రైతుల ప్రాణాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిది. కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కమిషన్ల పేరుతో కక్షసాధింపు రాజకీయాలు చేయడం సరికాదు.
-కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే, దుబ్బాక
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం..
కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు వెల్లడించిన తీర్పును స్వాగతిస్తున్నాం. కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదనే అంశాన్ని న్యాయస్థానం గుర్తించింది. కక్ష సాధింపుల్లో భాగంగానే తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చారు. దేశానికి గర్వకారణంగా, రాష్ట్రానికి జీవనాడిగా నిలిచిన ఈ ప్రాజెక్టు బీడు భూములకు సాగునీరందించి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసింది.

ప్రజల దాహార్తిని తీర్చింది. దేశ నీటిపారుదల రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్టు విశిష్టత గురించి 17వ లోక్‌సభలో ప్రస్తావించాను. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, అవసరమైన నిధులు విడుదల చేయాలని గతంలో లోక్‌సభలో కేంద్రాన్ని కోరా.
-నామా నాగేశ్వర్రావు, లోక్‌సభ బీఆర్ఎస్ మాజీ పక్షనేత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

