హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం అబద్ధ్దాలాడుతున్నదని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. జనగామ లేదా మధిర ఏ నియోజకవర్గానికైనా పోదామని, 100 శాతం మాఫీ అయినట్టు నిరూపిస్తే రైతుల ముందే ముక్కు నేలకు రాసి, రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం వాడీవేడి చర్చ జరిగింది. బీఆర్ఎస్ పక్షాన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి ఆటంకం కలిగించినా వెనక్కి తగ్గని పల్లా.. వారిని దీటుగా ఎదుర్కొన్నారు.
‘గవర్నర్ ప్రసంగానికి దిశ.. దశ.. పస లేదు. చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత. అరకొరగా 10 శాతం హామీలను అమలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో రూ.4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే, 15 నెలల్లోనే కాంగ్రెస్ సర్కారు రూ.1.66 లక్షల కోట్ల అ ప్పు చేసింది. కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు 564 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గురుకులా ల్లో 83 మంది చనిపోయారు. 116 మంది ఆటోకార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. పోతిరెడ్డిపా డు, ముచ్చుమర్రి ద్వారా ఏపీ రోజుకు రెండు టీఎంసీలు తీసుకెళ్తున్నది. సాగర్ కుడి కాల్వ ద్వారా రోజు 10 వేల క్యూసెక్కుల జలాలు వెళ్తుంటే.. ఎడమ కాల్వకు ఎందుకు నీళ్లు రావడం లేదు? దేవాదుల పంప్‌హౌజ్‌ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వ ర్క్స్కు రూ.6 కోట్లు ఇవ్వకపోవడంతో రూ.600 కోట్ల పంట నష్టం జరిగింది.
పంపులు ప్రారంభించిన మూడు రోజల్లోనే మళ్లీ బంద్ అయ్యాయి. ఎండిన పంటలకు ఎకరానికి రూ.20 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించేవాళ్లు సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఎ ట్లా? ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను వేరుచేయడమం టే తెలంగాణ బతుకును అవమానించినట్టే. తెలంగా ణ తల్లి సాదాసీదాగా ఉండాలని చెప్పే వాళ్ల కుటుం బ సభ్యులు మాత్రం నిండుగా నగలు వేసుకుని ఉం టారు. విద్యాశాఖ ప్రెస్‌నోట్‌లో రాజముద్రలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించారు. తె లంగాణ రాజముద్రను మారిస్తే.. రుద్రమదేవి, స ర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్కల సాక్షిగా పోరాడుతాం.
సీఎం వి ద్యాశాఖ మం త్రిగా ఉండగా, ఏడాదిలో 2 లక్షల మంది విద్యార్థులు ఎందుకు డ్రాపౌట్ అయ్యారు? బీఆర్ఎస్ సర్కారు 30 మంది వీసీలను నియమించింది. వారిలో దళితులు ఉన్నారు. 56 వేల ఉద్యోగాల్లో కాంగ్రెస్ 11 వేలు మాత్రమే ఇచ్చింది. మిగతావన్ని గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినవే’ అని పల్లా తెలిపారు. జర్నలిస్టులు రేవతి, తన్వియాదవ్లను వెంటనే విడుదల చేయాలని డి మాండ్ చేశారు. మహిళా జర్నలిస్టులను టెర్రరిస్టుల తరహాలో అరెస్ట్ చేశారని, ఇలాంటి దుస్థితిని తాను ఏ ప్రభుత్వంలో చూడలే దని మండిపడ్డారు. ప్రజల మనోభావాలను మాత్రమే ఈ జర్నలిస్టులు తమ చా నల్లో ప్రసారం చేశారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాళోజీ కవిత ద్వారా సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపారు.