లింగాల గణపురం : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై పార్టీ ఫిరాయింపుల వేటు మూడు నెలల్లోపు పడుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం లోని పలు గ్రామాల్లో జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను ఇంకా మూడేళ్లు ఎమ్మెల్యేగా ఉంటానని, ఎంపీగా కడియం కావ్య ఉంటుందని కడియం కలలు కంటున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించకపోతే తాను ఆ గ్రామాలకు నయా పైసా ఇవ్వనని ఓటర్లను కడియం బెదిరిస్తున్నాడని పల్లా ఆరోపించారు.
గ్రామపంచాయతీ నిధులు ఏమైనా కడియం అబ్బ సొమ్మ అంటూ విరుచుకుపడ్డారు. కోన్ కిస్కా గొట్టం గాళ్ల బెదిరింపులకు ఓటర్లు భయపడవద్దన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. ఖబర్దార్ కడియం పిచ్చి వేషాలేస్తే బీఆర్ఎస్ ఉద్యమించి తాటతీస్తుందని ఆయన హెచ్చరించారు. సమావేశాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బసవగాని శ్రీనివాస్ గౌడ్, నాయకులు సేవేలి సంపత్, చిట్ల జయశ్రీ, ఉపేందర్ రెడ్డి, దుంబాల భాస్కర్ రెడ్డి, చౌదర పెళ్లిశేఖర్, ఆయా గ్రామాల బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.