బచ్చన్నపేట ఏప్రిల్ 13 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలాన్ని మద్యం రహిత మండలం గా తీర్చిదిద్దుకుందామనిఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని చిన్న రామన్ చర్ల, నక్కవాని గూడెం, రామచంద్ర గూడెం, కొడవటూరు, కొన్నే, పడమటి కేశపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో బెల్ట్ షాపుల జోరు ఎక్కువైందని, ఫలితంగా ప్రజలు తెల్లవారకముందే బెల్ట్ షాపుల్లోకి వెళ్లి మద్యం సేవించి అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు బార్లను తలపిస్తున్నాయని అన్నారు.
అంతేకాకుండా ఎంఆర్పి ధరలకంటే అధికంగా వసూలు చేస్తూ, ప్రజల డబ్బులను దోచుకుంటున్నారన్నారు.
గ్రామాల్లో బెల్ట్ షాపులు ఇష్ట రాజ్యాంగ నడుస్తున్న ఎక్సైజ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ మండలంలో నాలుగు గ్రామాల్లో మధ్య నిషేధం అమల్లో ఉందని, గ్రామాల్లో స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గ్రామంలో మద్దిలేషణ అమలు చేసుకోవాలని సూచించారు. వారం రోజుల్లో మండలంలో బెల్ట్ షాపులన్నీ బందు చేయాలని, లేని పక్షంలో తానే వచ్చి షాపుల్లో లో సీసాలన్నీ పగలగొడతానని హెచ్చరించారు. పండించిన ప్రతి రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు.
కార్యక్రమంలో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేత వెంకటాచారి, సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, సర్పంచులు ఆజాం ,వెంకటేష్, వినోద్ కుమార్, నీల కవిత, విజయ సోములు, మద్దికుంట రాద, పాకాల నాగలక్ష్మి, శ్రీధర్ గౌడ్,నాయకులు చల్లా శ్రీనివాసరెడ్డి, కోనేటి స్వామి ముసిని రాజు గౌడ్, అనిల్ రెడ్డి, ఈదులకంటి ప్రతాపరెడ్డి, తిరుమల్ రెడ్డి, అశ్విన్ కుమార్, కర్ణాకర్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, కనకయ్య గౌడ్, గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్, స్వప్న, స్రవంతి, మేకల రాజు, బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.