కొమురవెల్లి, నవంబర్ 21: హైదరాబాద్‌కు ఫార్ములా ఈ- కార్ రేస్ తీసుకువచ్చి హైదరాబాద్ ఇమేజ్ను పెంచిన కేటీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో శుక్రవారం పలువురు బీజేపీ, కాం గ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని విమర్శించారు. రెండేండ్లుగా ఈ-రేసుపై విచారణ పేరుతో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ తెచ్చిన ఈ-కార్ రేసుతో హై దరాబాద్ ప్రపంచ దృష్టిలో పడటంతో పాటు చాలా పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం, డబ్బు వెదజల్లడంతోనే కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు.