హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): రిజర్వాయర్లు నింపి జనగా మ నియోజకవర్గంలోని ఆయకట్టు ప్రాంతానికి సాగునీరివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా గండిరామారం, బొమ్మకూరు, కన్నెబోయినగూడెం, వెల్దండ, లద్నూర్, తపాస్పల్లి రిజర్వాయర్లను నింపాలని కోరా రు. నాట్లు అయిపోయి సాగునీటి కోసం రైతుల తడ్లాడుతుంటే అధికారులు, ప్ర భుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని శుక్రవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై అధి కారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవ డం లేదని ఆయన మండిపడ్డారు. సమస్యలపై సానుకూల చర్యలు తీసుకోకపో గా, అన్ని పంపులను బంద్ చేశారని ఆ రోపించారు. వెంటనే అన్ని పంపులు, మోటార్లను ఆన్చేయకుంటే రైతులతో కలిసి పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలను చేపడతానని పల్లా హెచ్చరించారు.