చేర్యాల, ఏప్రిల్ 8 : పార్టీలు మారుతున్న ఊసరవెల్లి ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీతి లేకుండా మాట్లాడుతున్నాడని, త్వరలో ఆయ న ముసుగు తొలిగిస్తామని జనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆంధ్రా అల్లుడితో ఆయన చేయిస్తున్న దోపిడీని ప్రజ లే బట్టబయలు చేస్తారని చెప్పారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో మంగళవారం బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి చేర్యాల టౌన్, చేర్యాల, కొమురవెల్లి మండలాల ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే సభ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటీవల తనపై చేస్తున్న వ్యాఖ్యలపై పల్లా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేవునూ రు అటవీ భూముల పక్కన ఎమ్మెల్యే కడి యం తన బినామీలతో భూములు కొనుగోల చేయిస్తున్నారని ఆరోపించారు. ముప్పారం లో మరో 24 ఎకరాలు ఇటీవల కొనుగోలు చేసి, సదరు భూములకు వెళ్లేందుకు రోడ్లు నిర్మించడమే కాకుండా ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అల్లుడు పోలీస్, రెవెన్యూ, అటవీశాఖల అధికారులను గుప్పెట్లో పెట్టుకుని కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన గురించి మాట్లాడే అర్హత సదరు కడియంకు లేదని చెప్పారు.