హుజూరాబాద్ టౌన్, జూలై 29 : సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన చేతిలో పెట్టుకొని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ, గురుకులాల ఆశయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. విద్యార్థులు అధైర్య పడొద్దని, బీఆర్ఎస్ పక్షాన అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఇటీవల హుజూరాబాద్ మున్సిపల్ పరిధి బోర్నపల్లి శివారులోని మహాత్మాజ్యోతిబాఫూలే బీసీ బాలుర (సైదాపూర్) గురుకులంలో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటన కలకలం సృష్టించగా, మంగళవారం ఎమ్మెల్యే గురుకులాన్ని పరిశీలించారు. విద్యార్థులు, ప్రిన్సిపాల్ రాణితో మాట్లాడారు. ఎలుకలు కొరికిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసిందని చెప్పా రు. అనంతరం హుజూరాబాద్‌లోని బు డగ జంగాల కాలనీలోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థి మద్యం తాగిన ఘటనపై వార్డెన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.