హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : స్టేషన్‌ఘన్‌పూర్ సభలో ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ ఝూటామాటలు మాట్లాడారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ..
‘ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి, 15 నెలలైనా ఎందుకివ్వలేదు? జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదేందుకు? ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదేందుకు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.