హైదరాబాద్ సిటీబ్యూరో/మెహిదిపట్నం, జనవరి 17 (నమస్తే తెలంగాణ): పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడనే ఆరోపణపై నమోదైన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి శుక్రవారం మాసబ్‌ట్యాంక్ ఠాణాలో విచారణకు హాజరయ్యారు.
ఈ కేసు విచారణ అధికారి ఇన్స్పెక్టర్ పరుశురాం ఆయనను గంటకుపైగా విచారించారు. ఈ సందర్భంగా 32 ప్రశ్నలు అడిగి ఎమ్మెల్యే స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్ వద్ద కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనపై ప్రభుత్వం అక్రమ కేసు లు బనాయించిందని ఆరోపించారు. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నదని ఫిర్యాదు చేయడానికి డిసెంబర్ 4న బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లానని ఆయన చెప్పారు.