హనుమకొండ, మే 20 : ఉద్యోగుల సమస్యల పరిష్కార విషయం లో సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశా రు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనం దున సీఎం ఉద్యోగుల విషయంలో అలా మాట్లాడారని వివరించారు.
మంగళవారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్లోని టీఎస్ ఈఈయూ-327 కార్యాలయంలో జరిగిన శ్రమశక్తి అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక వనరులు పెంచుకోవడంపై సీఎం ప్రత్యేకదృష్టి సారించారని చెప్పారు. టీఎస్ ఈఈయూ-327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ మా ట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి రూపాయి కూడా ఇవ్వలేమనడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.