వివకారాబాద్ : వెనుకబడిన కొడంగల్ నియోజవర్గాన్ని రెండువేల రూపాయలు ఖర్చుపెట్టి సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు. గతంలో ఇరవై ఐదు సంవత్సరాలు పాలించిన గుర్నాథ్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయాలన్నారు. రేవంత్ రెడ్డి కూడా చేసింది ఏమీ లేదని కొడంగల్( Kodangal) ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి(MLA Narender reddy ) విమర్శించారు. బుధవారం ఆయన కోస్గిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్ తో కలిసి పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని గ్రామాలకు, తండాలకు రోడ్లు, రెండు మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నాం.
విద్యా, వైద్య ఆరోగ్య సౌకర్యాలను ఉన్నతంగా కల్పించాం. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకున్నామని ఆయన తెలిపారు. అనేక చెక్ డ్యాంలు నిర్మించి నీటి సమస్యను తీర్చాం. రేవంత్ రెడ్డి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పి మళ్లీ ఈ రోజు పోటీ చేస్తున్నారని విమర్శించారు. కర్నాటక రైతులు మన వద్దకు వచ్చి కరెంట్, పెన్షన్లు సరిగా ఇవ్వండి లేదు. కాంగ్రెస్ మాటలు నమ్మి మీరు మోసపోవద్దని చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ గుండాలు అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఆ పార్టీ నేతలే రేటెంత రెడ్డి అంటున్నారని ఎద్దేవా చేశారు. కావున బీఆర్ఎస్కు ఓటువేసి అభివృద్ధికి పాటుపడాలన్నారు.నియోజకవర్గంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, మద్దూరును మున్సిపాలిటీగా చేయాలని కేసీఆర్ను కోరారు. అలాగే యువతకు ఉపాధి కల్పించేందుకు టెక్స్టైల్స్ ఏర్పాటుతో పాటు భోంరాస్పేటలో జూనియర్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.